'చావు కబురు చల్లగా' నుంచి మల్లిక గా లావణ్య త్రిపాఠి
Send us your feedback to audioarticles@vaarta.com
డింపుల్ బ్యూటి లావణ్య త్రిపాఠి మల్లిక గా చావుకబురు చల్లగా చిత్రం తో కనిపించనుంది. అందాల రాక్షసి చిత్రం లో మనింటి అమ్మాయిలా అందర్ని తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పడు మల్లిక గా మెదటి లుక్ లోనే అందరికి దగ్గరయ్యింది. ఇప్పడు మల్లిక మన బస్తి బాలరాజు తో జోడి కట్టేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో వరస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన బన్నీ వాసు నిర్మాతగా.. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించింది. కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మల్లిక గా చాలా నాచురల్ గా ఉన్న ఈ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఈమె పాత్ర కూడా ఇంతే న్యాచురల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత బన్నీ వాసు గారు మాట్లాడుతూ.. జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో భలేభలే మగాడివోయ్, గీతాగోవిందం, ప్రతిరోజు పండగే చిత్రాలు ఘన విజాయాలు సాధించాయి. అలాంటి బ్యానర్ లో వచ్చే ప్రతి చిత్రంపై ప్రేక్షకులకి అంచనాలు వుంటాయి. వారిని దృష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా వుండాలి అనుకున్నాం. అందుకే బస్తిబాలరాజు గా టీజర్ లో చూపించాం. అలానే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ని మల్లిక గా పరిచయం చేసాం. మా మల్లిక పోస్టర్ చూసిని వారంతా చాలా బాగుందని ప్రశంశిస్తున్నారు. తన పాత్ర ప్రతి ఓక్కరి కి గుర్తుండిపోతుంది. దర్శకుడు కౌశిక్ కొత్తవాడయినా చాలా టాలెంట్ వున్నవాడు. చెప్పిన పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. రెగ్యులర్ సినిమా కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుంది. అని అన్నారు
తారాగణం.. కార్తీకేయ, లావణ్య త్రిపాఠి, ఆమని,మురళి శర్మ, రజిత, భద్రం, మహేష్, ప్రభు తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com