'కొరమీను' మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన లావణ్య త్రిపాఠి

  • IndiaGlitz, [Saturday,October 29 2022]

జాలరిపేట నేపధ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కొరమీను' .ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ రవి హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నటీ నటులుగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు.ఈ కోరమీను మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదల చేశారు.

మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘమృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బొట్స్ కనిపించగా అందులోని ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' అంటూ పోస్టర్‌లోని BGM, సెట్టింగ్ మరియు పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అక్కడే ఒక యువకుడు సీరియస్ గా ఎంతో తీక్షణమైన లుక్‌తో చూసే విధానం చూస్తుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

ఈ సందర్బంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. మా చిత్ర మోషన్ పోస్టర్ ను లావణ్య త్రిపాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ విషయానికి వస్తే జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. .సరదా-ప్రేమగల డ్రైవర్, అతని యజమాని అయిన అహంకారి ధనవంతుడు మరియు వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్ తో వస్తున్న కొరమీను అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటీ నటులు : కోటిగా ఆనంద్ రవి, కరుణ పాత్రలో హరీష్ ఉత్తమన్, మీసాల రాజుగా శత్రు, మీనాక్షిగా కిషోర్ ధాత్రక్, దేవుడిగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యంగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రంగా ప్రసన్న కుమార్, కరుణకు సహాయకుడిగా ఆర్కే నాయుడు

More News

నాని చేతుల మీదుగా అశోక్ సెల్వన్ ‘ఆకాశం’ ట్రైలర్ రిలీజ్

వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’.

దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా "భీమదేవరపల్లి బ్రాంచి" ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ఫస్ట్ లుక్,

కెప్టెన్‌గా శ్రీహాన్.. మళ్లీ బావ కౌగిట్లోకి ఇనయా, ఆదిరెడ్డికి సర్‌ప్రైజ్

బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా టాస్క్‌లు మంచి మజాను ఇస్తుండగా..

Faria Abdullah: లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్... ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్  ఫరియా అబ్దుల్లా

దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్.

Balakrishna: నందమూరి బాలకృష్ణ తొలి బ్రాండ్ కమర్షియల్ 'సాయి ప్రియా గ్రూప్ 116 పారామౌంట్'

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృ తన తొలి బ్రాండ్ కమర్షియల్‌ తో అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.