కోటీశ్వ‌రుడి కూతురిగా లావ‌ణ్య‌

  • IndiaGlitz, [Sunday,January 07 2018]

అందాల రాక్ష‌సితో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన లావ‌ణ్య త్రిపాఠి.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు వంటి చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే గ‌తేడాది విడుద‌లైన మిస్ట‌ర్, రాధ‌, యుద్ధం శ‌ర‌ణం, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, ప్రొజెక్ట్ జెడ్ చిత్రాలు ఆమెకి విజ‌యాన్ని అందివ్వ‌లేక‌పోయాయి.

ఈ నేప‌థ్యంలో తన ఆశ‌ల‌న్నింటిని కొత్త చిత్రం ఇంటెలిజెంట్ పైనే పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో లావ‌ణ్య మిలీనియ‌ర్ కూతురిగా క‌నిపించ‌బోతోంది.

జ‌ల్సాగా జీవితాన్ని గ‌డిపే ఈమె జీవితం హీరో ప‌రిచ‌యంతో ఎలా ట‌ర్న్ అయ్యింద‌న్న‌దే ఈ పాత్రకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం. అంతేకాదు.. ఈ పాత్ర‌లో లావ‌ణ్య ఆల్ట్రా మోడ్ర‌న్‌గా క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. ఫిబ్ర‌వ‌రి 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.