లావణ్య పెంచేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి వచ్చి 5 ఏళ్లయ్యింది. ఈ ఐదేళ్లలో ఆ చిత్ర కథానాయిక లావణ్య త్రిపాఠి చెప్పుకోదగ్గ విజయాలనే తన ఖాతాలో వేసుకుంది. వాటిలో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా.. లావణ్య కెరీర్లో ది బెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం బిజీగా ఉన్న యువ కథానాయికల్లో లావణ్య ఒకరు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాల(మిస్టర్, రాధ)తో సందడి చేసిన లావణ్య.. మరో మూడు సినిమాలతో పలకరించనుంది.
మాయావన్ (తెలుగులో ప్రాజెక్ట్ z), యుద్దం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ.. ఇలా ఆ మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. విశేషమేమిటంటే.. కెరీర్లో ఇప్పటివరకు ఏ సంవత్సరంలోనూ ఇలా ఐదు సినిమాలు చేసిన సందర్భం లేదు లావణ్యకి. మొత్తానికి 2017 సినిమాల సంఖ్య పరంగా లావణ్యకి ఎంతో స్పెషల్ అన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout