టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాను - లావణ్య త్రిపాఠి
Saturday, April 15, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన చిత్రం `మిస్టర్`. ఏప్రిల్ 14న సినిమా విడుదలైంది.
చంద్రముఖి అనే అమ్మాయికి సెల్‌ఫోన్, కంప్యూటర్ గురించి ఏమీ తెలియదని డైరెక్టర్ చెబుతున్నప్పుడు ఓ అమ్మాయి ఏమీ తెలియకుండా ఎలా ఉంటుందోనని ఆలోచించాను. ఆ ఆలోచనే చంద్రముఖి క్యారెక్టర్ చేయడానికి కారణమైంది. సినిమాలో హాఫ్ శారీ కట్టుకున్నాను. క్యారెక్టర్ లుక్ పరంగా కొత్తగా చేయాలనుకుంటాను. నేను ఇండియన్, వెస్ట్రన్ స్టయిల్లో దుస్తులు ధరిస్తుంటాను.`మిస్టర్` జర్నీ చాలా సాఫ్ట్‌గా జరిగింది. శ్రీనువైట్ల వంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్‌కు భిన్నంగా ఉండే చంద్రముఖి అనే క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. క్యారెక్టర్ పరంగా నేను, రూప వైట్ల డిస్కస్ చేసుకుని, కళ్ళు పెద్దగా ఉండటానికి లెన్స్ వేసుకున్నాను, రాజుల కాలంనాటి స్టయిల్లో ఉండే అభరణాలను ధరించాను. వరుణ్‌తేజ్ మంచి యాక్టర్, హీరోగా భవిష్యత్ ఉంటుంది.
ఏమీ తెలియని చంద్రముఖి క్యారెక్టర్ చేయడాన్ని ఛాలెంజింగ్‌గా భావించాను. హీరోయిన్‌గా ఎక్స్‌పోజ్ చేయడాన్ని గ్లామర్ అని అనుకోను. శ్రీనువైట్లగారు సినిమాను చాలా చక్కగా తీశారు. ముఖ్యంగా నా క్యారెక్టర్‌ను చక్కగా డిజైన్ చేశారు. ప్రతి సీన్‌ను ఎలా చేయాలో చెప్పి చేయించుకున్నారు. నేను ప్రస్తుతం టాలీవుడ్‌పైనే కాన్‌సన్ ట్రేషన్ పెట్టాను. తమిళంలో మాయావన్ అనే సినిమా చేశాను. అందులో సైక్రియాటిస్ట్‌గా చేశాను. తెలుగులో పక్కా కమర్షియల్ మూవీ `రాధ` చేశాను. అలాగే నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను.తెలుగు బాగానే అర్థమవుతుంది. బాగా మాట్లాడుతున్నాను కూడా. తెలుగులో డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను అని లావణ్య తన మనసులో మాటలను తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments