మిస్టర్ సెట్ లో లావణ్య బర్త్ డే సెలబ్రేషన్స్..!

  • IndiaGlitz, [Friday,December 16 2016]

అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...ఆత‌ర్వాత దూసుకెళ్తా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీర‌స్తు, శుభ‌మ‌స్తు చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న అందాల నాయిక లావ‌ణ్య త్రిపాఠి. తాజాగా లావ‌ణ్య మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మిస్ట‌ర్ సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం వికారాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఇదిలా ఉంటే...
ఈనెల 15న లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లావ‌ణ్య త్రిపాఠి బ‌ర్త్ డే ను మిస్ట‌ర్ యూనిట్ స‌భ్యులు సెల‌బ్రేట్ చేసారు. మిస్ట‌ర్ సెట్ లో వ‌రుణ్ తేజ్, డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల‌, హీరోయిన్ హెబ్బా ప‌టేల్, స‌త్యం రాజేష్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొని లావ‌ణ్య త్రిపాఠికి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేసారు.