తిక్క మోషన్ పోస్టర్ లాంచ్
- IndiaGlitz, [Saturday,June 25 2016]
సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా నటించిన చిత్రం తిక్క. ఈ చిత్రాన్ని సునీల్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ బ్యానర్ పై సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న తిక్క సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...డైరెక్టర్ సునీల్ కి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకోవాలనే తిక్క ఉంది. రోహిన్ కుమార్ సినిమా మీద, సునీల్ మీద ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారాడు. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హ్యాట్రిక్ సాధించాడు. సెకండ్ హ్యాట్రిక్ ఈ సినిమా స్టార్ట్ కానుంది అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...వి.బి.రాజేంద్రప్రసాద్ గారు తర్వాత నేను చూసిన మరో అద్భుతమైన నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి. ఆర్టిస్టులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. యువ దర్శకులు నాకోసం పాత్రలు రాస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మూవీలో ఎంత యాక్షన్ ఉంటుందో అంత కామెడీ అంటుంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...ఈ చిత్ర దర్శకుడు సునీల్ రెడ్డి, నిర్మాత రోహిన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన నా సినిమాల ఆడియోకు, ఈ ఆడియోకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. కెమెరామెన్ గుహన్ నన్ను చాలా అందంగా చూపించారు. ఈ మూవీలో నేను టిపికల్ క్యారెక్టర్ చేసాను. డిఫరెంట్ గా ఉండే తిక్క డెఫినెట్ గా హిట్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ...సాయిధరమ్ తేజ్ తో సినిమాల్లో రాక ముందు నుంచి పరిచయం ఉంది. లక్కీగా సాయిధరమ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. తమన్ పెంటాస్టిక్ ఆల్బమ్ అందించాడు అన్నారు.
నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా అపుట్ పుట్ బాగా వచ్చింది. ఫస్ట్ ఈ రంగంలోకి రావడం అవసరమా అనుకున్నాను. అయితే తేజుని కలిసిన తర్వాత సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. పదిరోజుల్లో టీజర్ రిలీజ్ చేసి ఆగష్టులో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ...ఇది ఫ్రెష్ సబ్జెక్ట్ తో చేసిన మూవీ. స్ర్కీన్ ప్లే - డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. మోషన్ పోస్టర్ చాలా ఎగ్జైట్ గా ఉంది. త్వరలోనే పాటలు రిలీజ్ చేయనున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలీ, హీరోయిన్ లారిస్సా బొనెసి, గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్, రచయిత హర్షవర్ధన్, తాగుబోతు రమేష్, సత్య తదితరులు పాల్గొన్నారు.