రాజ్ కందుకూరి చేతుల మీదుగా 'నయనం' టైటిల్ లోగో లాంచ్!
- IndiaGlitz, [Tuesday,October 03 2017]
లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న మొదటి చిత్రం 'నయనం'. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద ఈగ, మర్యాద రామన్న , మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో 'పెళ్లి చూపులు' చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ..."'నయనం' టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్టు కూడా కొంచెం విన్నాను ఇంట్రస్టింగ్ గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి గారి శిష్యుడి డైరక్షన్ లో సినిమా వస్తుందంటే ఎలా ఉండబోతుందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిర్మాత కూడా చాలా ప్యాషనేటెడ్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్టిస్టులందరూ కూడా టాలెంటెడ్ పర్సన్స్. అందరికీ నా శుభాకాంక్షలు"అని తెలిపారు.
దర్శకుడు క్రాంతి కుమార్ వడ్లమూడి మాట్లాడుతూ... “ 'నయనం' టైటిల్ లోగో ఆవిష్కరణకు విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని" అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ...." మా తొలి చిత్రం 'నయనం' లోగో లాంచ్ అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఎనౌన్స్ చేసిన నయనం టైటిల్ కు, థీమ్ ఏంటో గెస్ చేయండంటూ మేము నిర్వహించిన వినూత్నమైన కాంటెస్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి రోజున మా చిత్రానికి సంబంధించిన టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ పొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నాం" అన్నారు.
ఇంకా ఈ టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నటులు నోయల్, శ్రీ, అర్జున్ ఆనంద్ ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్రానికి కెమెరా చేతన్ మధురాంతకం , సంగీతంః గీత పూనిక , ఆర్ట్ఃరమేష్ , ప్రొడక్షన్ కంట్రోలర్ః చౌదరి , ప్రొడక్షన్ మేనేజర్ః మోహన్ రావు , పిఆర్ఓః కుమార స్వామి , కాస్ట్యూమ్ డిజైనర్ః అజబ్ , రచన సహకారంః టైం నాని , రవి కిరణ్ , కథః లావోస్ మోషన్ పిక్చర్స్ , నిర్మాతలుఃరామ్ కేతు, కృష్ణ మోహన్ , శ్రీ రామ్ కందుకూరి , నరేన్ లేబాకు, స్క్రీన్ ప్లే - దర్శకత్వంః క్రాంతి కుమార్ వడ్లమూడి.