లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా బారినపడిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సమదాని తెలిపారు. గత నెలలో లతా మంగేష్కర్ కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా పాజిటివ్‌గా తేలడంతో లతా మంగేష్కర్‌ను జనవరి 8న ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు లతాజీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది.
ఇక లతామంగేష్కర్ విషయానికి వస్తే.. పదమూడేళ్లకే ప్లే బ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఈ క్రమంలో లతాజీ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1948 నుంచి 1978 మధ్యకాలంలో 50 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు. గానకోకిల అనే బిరుదును అందుకున్నారు. సినీ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను సత్కరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments