మామ మంచు అల్లుడు కంచు లేటెస్ట్ అప్ డేట్..

  • IndiaGlitz, [Wednesday,October 21 2015]

మంచు మోహ‌న్ బాబు, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ మూవీని ఢ‌మ‌రుకం ఫేం శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై విష్ణు నిర్మిస్తున్నారు. మోహ‌న్ బాబు, రమ్య‌క్రిష్ణ‌, మీనా ఈ ముగ్గురు క‌ల‌సి అల్ల‌రి మొగుడు సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. వీరికి ఓ కూతురు పుడితే...కంచు లాంటి అల్లుడు వ‌స్తే..ఎలా ఉంటుంద‌నే క‌ధాంశంతో మామ మంచు అల్లుడు కంచు సినిమాని రూపొందిస్తున్నార‌ట‌.

ఇక ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...ఈనెల 24న ఈమూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు విష్ణు తెలిపారు. అలాగే క్రిస్మ‌స్ కానుక‌గా మూవీని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న మామా మంచు అల్లుడు కంచు ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో తెలియాలంటే డిసెంబ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నిహారిక ఎంట్రీ పై వ‌రుణ్ తేజ్ కామెంట్..

మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇస్తుంద‌నే వార్త అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది.

తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే

తేజ ఇటీవ‌ల హోరా హోరి అనే సినిమా తీసిన విష‌యం తెలిసిందే. త‌క్కువ బ‌డ్జెట్ లో తీసిన హోరా హోరి ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.

హ‌న్సిక మిస్స‌యింది

బాల‌న‌టి నుంచి హీరోయిన్‌గా ఎదిగిన హ‌న్సిక‌.. 'దేశ‌ముదురు' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో సంద‌డి చేసిన ఈ చిన్న‌ది.

'బ్ర‌హ్మోత్స‌వం'తో మారుతుందా?

తెలుగు ద‌ర్శ‌కుల‌కు ద్వితీయ విఘ్నం అనే స‌మ‌స్య గ‌త కొన్నాళ్లుగా వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించిన అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో త్రివిక్ర‌మ్, శ్రీ‌కాంత్ అడ్డాల‌, కొర‌టాల శివ ల‌ను చేర్చుకోవ‌చ్చు.

ఎన్టీఆర్ కే కాదు ర‌కుల్‌కీ ప్ర‌త్యేక‌మేన‌ట‌

'నాన్న‌కు ప్రేమ‌తో'.. ఈ సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. హీరోగా త‌ను చేస్తున్న 25వ చిత్ర‌మిది.