ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా హెల్త్ అప్‌డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఎంజీఎం ఆసుపత్రి ఎస్పీబీ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఆయన పూర్తి తెలివితో ఉన్నారని.. యాక్టివ్‌గా రెస్పాండ్ అవుతున్నారని ఫిజయో థెరపీని కూడా యాక్టివ్‌గా చేయించుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
‘‘కోవిడ్-19 కారణంగా ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ఇంకా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన పూర్తి తెలివితో ఉన్నారు. ప్రతి దానికీ రెస్పాండ్ అవుతున్నారు.. ఫిజియోథెరపీకి కూడా చాలా యాక్టివ్‌గా చేయించుకుంటున్నారు. మా ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com