రామ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ హీరో రామ్ కి తండ్రిగా నటిస్తున్నారు. ఫాదర్ - సన్ రిలేషన్ కథాంశంగా ఈ చిత్రం రూపొందుతుంది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రం గురించి 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ట్విట్టర్ లో స్పందిస్తూ...వైజాగ్ లో ఈ మూవీకి సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రాన్ని దసర కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. కందిరీగ సినిమాతో సక్సెస్ సాధించిన రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ ఈసారి కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments