RC15 క్రేజీ అప్డేట్.. ఆ మూవీ చూసి ఒక్క ఫోటో చాలనుకున్నా, అలాంటిది..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కాంబినేషన్ భారీ చిత్రానికి రంగం సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు, రాంచరణ్ ఇద్దరూ చెన్నైకి వెళ్లి శంకర్ ని కలసి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈ చిత్ర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
స్టార్ రచయిత బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించనున్నారు. సాయి మాధవ్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. శంకర్ ని కలసిన తర్వాత ఆయనతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు.
'జెంటిల్ మెన్ చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. అలాంటిది ఆయన చిత్రానికి ఇప్పుడు మాటలు రాస్తున్నా. శంకర్ సర్ కి, దిల్ రాజు గారికి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు థ్యాంక్స్' అని బుర్రా సాయి మాధవ్ ట్వీట్ చేశారు.
బుర్రా సాయి మాధవ్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ రైటర్. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రానికి కూడా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. అనేక క్రేజీ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. చారిత్రాత్మక నేపథ్యం అయినా, సమకాలీన అంశాలు అయినా ఎలాంటి సిట్యువేషన్ లో అయినా పవర్ ఫుల్ డైలాగ్స్ అందించగల రచయిత సాయి మాధవ్. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com