రాజశేఖర్ - ప్రవీణ్ సత్తార్ మూవీ అప్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
అంకుశం, ఆహుతి, ఆగ్రహం, మహంకాళి...ఇలా పోలీస్ క్యారెక్టర్స్ తో మెప్పించి యాంగ్రీమేన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్ తాజాగా మరోసారి పోలీస్ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే...హాలీవుడ్ మూవీ డై హార్ట్ కి ఫ్రీమేక్ గానో, రీమేక్ గానో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
కానీ...డై హార్ట్ మూవీకి ఫ్రీమేక్ & రీమేక్ కాదట. ఆ చిత్రంలో బ్రూస్ విల్లీస్ క్యారెక్టర్ లా రాజశేఖర్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. స్ర్కిప్ట్ వర్క్ మొత్తం పూర్తైన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ చిత్రం విజయం అందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments