పవన్ 27 లేటెస్ట్ అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’తో పాటు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్స్‌లో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని ఈ నెల 8 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవన్‌కల్యాణ్ పాల్గొంటాడని టాక్. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే సినిమా అని టాక్.
అలాగే ఈ చిత్రంలో పవన్‌కు ధీటుగా నటించబోయే విలన్ పాత్రలకు బాలీవుడ్ నటుడ్ని తీసుకోవాలని క్రిష్ యోచిస్తున్నాడట. ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్‌తో పవన్ డిస్కషన్స్ చేస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండెజ్ కూడా హీరోయిన్‌గా నటిస్తుందని టాక్.అంతా పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్థం చివరలో కానీ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments