చిరు 153 రీమేక్ కాదా?... లేటెస్ట్ అప్ డేట్‌!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ ఇంకా సెట్స్‌పైనే ఉంది. మ‌రో ప‌క్క చిరంజీవి 153వ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. మ‌ల‌యాళంలో సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని కూడా రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నారు. కాగా..ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే టాక్ న‌డిచింది. కొన్ని రోజుల ముందు వ‌ర‌కు చిరు 153ని సుకుమార్ డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. కానీ బ‌న్నీ సినిమాతో సుకుమార్ బిజీగా ఉండ‌టం వ‌ల్లే వి.వి.వినాయ‌క్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఓ ప‌క్క చిరు లూసిఫ‌ర్ సినిమా క‌థ‌తో పాటు కొత్త క‌థ‌ను విన్నాడ‌ట‌. సినిమా చూపిస్త‌మావ‌, నేను లోక‌ల్ చిత్రాల ర‌చ‌యిత ప్ర‌స‌న్న‌కుమార్ రాసిన క‌థ చిర‌జీవికి బాగా న‌చ్చింద‌ట‌. ఆ సినిమాను త‌న 153గా చేస్తే బావుంటుంద‌ని కూడా చిరు భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం వినాయ‌క్ ద‌గ్గ‌ర చిరు 153కి సంబంధించి రెండు ఆప్ష‌న్స్ ఉన్నాయి. అంతా ఓకే అయితే జూన్ కంతా సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఈ ఏడాది చివ‌ర‌లోనే చిరు త‌న 153 చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. మ‌రి త‌ద‌నంత‌ర ప‌రిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.