YCP:ఏపీలో మళ్లీ 'ఫ్యాన్' ప్రభంజనమే.. సంచలనంగా మారిన తాజా సర్వే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పోలింగ్‌కు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమంటూ ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలింది.
‘ఆంధ్ర లైవ్ న్యూస్’(Andhra Live News ) నిర్వహించిన సర్వేలో ఈసారి కూడా జగన్ పార్టీ హవా కొనసాగుతుందని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఈసారి ఓటరు నాడి ఎలా ఉంది? ప్రజలు ఎవరికి అధికార పీఠాన్ని అప్పగిస్తారనే విషయాలపై ఏఎల్ఎన్ సర్వే చేసింది. నియోజకవర్గాల వారీగా సుమారు 31 రోజులపాటు ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు ఈ సంస్థ తెలిపింది. దీంతో ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీ అత్యధికంగా 149 స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తేలింది. అలాగే పొత్తులో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కేవలం 26 సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని వెల్లడించింది. ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే వైసీపీ 51శాతం ఓటింగ్ షేరుతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోనుందని స్పష్టంచేసింది. ఇక టీడీపీ కూటమికి 41 ఓటింగ్ శాతం వచ్చే ఛాన్స్ ఉండగా.. కాంగ్రెస్‌కు 4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే వైసీపీ 79 స్థానాల్లో 10వేలకు పైగా మెజార్టీ వస్తుందని.. 57 స్థానాల్లో 5-10వేల మెజార్టీ మధ్యలో వస్తుందని.. 13 సీట్లు మాత్రం 5వేల లోపు మెజార్టీ రావొచ్చని అభిప్రాయపడింది. కాగా ఈ సర్వే ప్రకారం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. అలాగే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున సానుకూలత ఉందని వివరించింది. మొత్తానికి ఏపీలో జగన్ పాలనకు తిరుగులేదని.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments