YCP:ఏపీలో మళ్లీ 'ఫ్యాన్' ప్రభంజనమే.. సంచలనంగా మారిన తాజా సర్వే..

  • IndiaGlitz, [Monday,April 29 2024]

ఏపీలో పోలింగ్‌కు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమంటూ ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలింది.

‘ఆంధ్ర లైవ్ న్యూస్’(Andhra Live News ) నిర్వహించిన సర్వేలో ఈసారి కూడా జగన్ పార్టీ హవా కొనసాగుతుందని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఈసారి ఓటరు నాడి ఎలా ఉంది? ప్రజలు ఎవరికి అధికార పీఠాన్ని అప్పగిస్తారనే విషయాలపై ఏఎల్ఎన్ సర్వే చేసింది. నియోజకవర్గాల వారీగా సుమారు 31 రోజులపాటు ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు ఈ సంస్థ తెలిపింది. దీంతో ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీ అత్యధికంగా 149 స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తేలింది. అలాగే పొత్తులో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కేవలం 26 సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని వెల్లడించింది. ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే వైసీపీ 51శాతం ఓటింగ్ షేరుతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోనుందని స్పష్టంచేసింది. ఇక టీడీపీ కూటమికి 41 ఓటింగ్ శాతం వచ్చే ఛాన్స్ ఉండగా.. కాంగ్రెస్‌కు 4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే వైసీపీ 79 స్థానాల్లో 10వేలకు పైగా మెజార్టీ వస్తుందని.. 57 స్థానాల్లో 5-10వేల మెజార్టీ మధ్యలో వస్తుందని.. 13 సీట్లు మాత్రం 5వేల లోపు మెజార్టీ రావొచ్చని అభిప్రాయపడింది. కాగా ఈ సర్వే ప్రకారం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. అలాగే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున సానుకూలత ఉందని వివరించింది. మొత్తానికి ఏపీలో జగన్‌ పాలనకు తిరుగులేదని.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేసింది.

More News

Janasena:ఎన్నికల వేళ జనసేనకు గుడ్ న్యూస్.. పార్టీ గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది.

Jagan:సీఎం జగన్.. చేసేవే చెబుతాడు.. చెప్పినవి చేస్తాడు..

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో మీద ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Bhuvaneswari: దళితులపై భువనేశ్వరి బూతుల ఆడియో నిజమే.. ఫేక్ కాదని నిర్థారణ..

ఏపీ ఎన్నికలు తారాస్థాయికి చేరాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. ఓవైపు అధికార వైసీపీ సభలకు ప్రజలు పోటెత్తుతుంటే..

YS Jagan: చెప్పాడంటే చేస్తాడంతే.. జగన్‌ ముద్దు.. బాబు వద్దు అంటున్న జనం..

రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. చేయగలిగిందే చెప్పాలి. అది నాయకుడి లక్షణం. అంతేకానీ తన రాజకీయ స్వార్థం కోసం అమలుకానీ హామీలు ఇచ్చి ప్రజల్లో ఆశలు రేపకూడదు.

Kalki2898AD:ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి' రిలీజ్ డేట్ వచ్చేసింది..

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’.