ఈ సర్వేతో ఏపీ సీఎం ఎవరో తేలిపోయింది!

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు తేల్చిన విషయం విదితమే. అయితే తాజాగా.. మరో సర్వేలో కూడా వైసీపీదే విజయమని స్పష్టమైంది. స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో వైసీపీ నిలుస్తుందని ‘వీడీపీ అసోషియేట్స్‌’ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్‌ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైసీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక అధికార పార్టీ టీడీపీకి 68 నుంచి 54 సీట్లు సాధిస్తుందని తేల్చి చెప్పింది. ఇక జనసేన విషయానికొస్తే.. ఒకటి నుంచి మూడు సీట్లు సాధించే అవకాశముందని స్పష్టం చేసింది. కాగా.. బీజేపీ, కాంగ్రెస్‌ సహా బీఎస్పీ, సీపీఐ, ఇతరులెవరూ ఖాతా తెరిచే పరిస్థితి లేదని తాము చేసిన సర్వేలే తేలిందని ‘వీడీపీ అసోషియేట్స్‌’ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. 

ఓట్ల శాతం విషయానికొస్తే.. 

వైసీపీ : 43.85 శాతం

టీడీపీ : 40 శాతం 

జనసేన : 9.8 శాతం 

బీజేపీ : 2.40 శాతం 

కాంగ్రెస్ : 1.65 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.

ఎంపీ సీట్ల విషయానికొస్తే...

టైమ్స్‌నౌ–వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లోనూ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను 20 స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడైంది. కాగా.. టీడీపీకి కేవలం ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఈ రెండు పోల్స్ తేల్చాయి.