తెలంగాణలో తాజాగా 1593 కేసులు..

  • IndiaGlitz, [Sunday,July 26 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సరికొత్తగా విడుదల చేశారు. తొలుత శనివారం ఒక బులిటెన్‌ను విడుదల చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సరికొత్తగా నేడు మరో బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 15,654 శాంపిళ్లను పరీక్షించగా.. తెలంగాణ వ్యాప్తంగా 1593 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,059కు చేరింది. తాజాగా కరోనా కారణంగా 8 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ 463 మంది మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 12,264 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 998 మంది కోలుకోగా.. మొత్తం ఇప్పటి వరకూ 41,332 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 3,53,425 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సరికొత్తగా విడుదల చేసిన బులిటెన్‌లో ఎన్ని చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది.. కోవిడ్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్‌ల ఖాళీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరిచారు.