రవితేజ సినిమా గురించి కొత్త వార్త..!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహా రాజా రవితేజ హీరోగా దిల్ రాజు ఒక్కడొచ్చాడు సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేయడం...ప్రారంభోత్సవం జరిగిన తర్వాత సెట్స్ పైకి వెళ్లకుండా సినిమా ఆగిపోవడం జరిగింది. కారణం...రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ, దిల్ రాజు మధ్య డిఫరెన్స్ వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. ఆతర్వాత రవితేజ చాలా ప్రాజెక్ట్స్ అనుకున్నప్పటికీ ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఇక రవితేజ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...రవితేజకి పటాస్, సుప్రీమ్ చిత్రాల దర్శకుడు అనిల్ రవిపూడి ఓ కథ చెప్పడం కథ విని రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం. త్వరలో ఎనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలిసింది. రవితేజ చాలా ప్రాజెక్ట్ లు అనుకున్నప్పటికీ రకరకాల కారణాల వలన ఆగిపోయాయి. మరి... ఈ ప్రాజెక్ట్ అయినా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com