ఎస్పీ బాలు హెల్త్‌పై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి క్రమ క్రమంగా మెరుగవుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌తో పాటు ఎంజీఎం వైద్య నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని.. రెస్పాండ్ అవుతున్నారని వైద్యులు తెలిపారు. ఎస్పీ చరణ్ కూడా ఓ వీడియో సందేశం ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు.

‘‘కరోనా కారణంగా ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన స్పృహలో ఉండటమే కాకుండా రెస్పాండ్ అవుతున్నారు. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

‘‘నాన్నగారి ఆరోగ్యం విషయంలో రికవరీ దిశగా తొలి అడుగు పడింది. నాన్నగారు మెల్లగా రికవరీ అవుతారన్న నమ్మకం ఉంది. ఎంజీఎం హెల్త్ సెంటర్ మెడికల్ టీం మాకు ా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నిన్న మొన్నటితో పోలిస్తే ఆయన చాలా తెలివిగా ఉన్నారు. ఆయన నిన్నటి కంటే బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన నాతో మాట్లాడేందుకు ట్రై చేశారు కానీ ఆయన ప్రాపర్‌గా మాట్లాడలేకపోతున్నారు. ఈ వారంలో ఆయన నాతో మాట్లాడుతారని నమ్ముతున్నా. ఆయన మ్యూజిక్ వింటున్నారు. పాడేందుకు ట్రై చేస్తున్నారు’’ అని చరణ్ తెలిపారు.