తెలంగాణలో తాజాగా 1931 కేసులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

  • IndiaGlitz, [Thursday,August 13 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు 2000 దాకా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23,303 పరీక్షలు నిర్వహించగా.. 1931 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 86475కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 665 మంది మృతి చెందారు.

కాగా.. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 1780 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 63074 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22736 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 298 కేసులు, జగిత్యాల 52, జనగామ 59, గద్వాల్ 56, కరీంనగర్ 89, ఖమ్మం 73, మల్కాజ్‌గిరి 71, నాగర్ కర్నూల్ 53, నిజామాబాద్ 53, నల్గొండ 84, పెద్దపల్లి 64, సిరిసిల్ల 54, రంగారెడ్డి 124, సంగరెడ్డి 86, సిద్దిపేట 71, సూర్యాపేట 64, వరంగల్ అర్బన్ 144 కేసులు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,89,150 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా ట్విట్టర్‌లో మాత్రం ఈ బులిటెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ‘మీరు ఈ డేటాను నమ్ముతారా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ బులిటెన్‌పై 420 చీటింగ్ కేసు వేయాలని ఒకరు.. అసలు ఈ బులిటెన్ చూస్తుంటే ఇంట్రస్ట్ అంతా పోతోందని మరొకరు.. ఫేక్ న్యూస్.. ఫేక్ బులిటెన్ అంటూ ఇంకొకరు మొత్తం మీద ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్‌పై నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

More News

నా తండ్రి జీవించే ఉన్నారు: ప్రణబ్ కుమారుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరమపదించారంటూ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి హాజరైన పలువురికి కరోనా!

కరోనా వివాహ వేడుకలను సైతం వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ దాని పని అది చేసుకుపోతోంది.

రియాకు టాలీవుడ్‌తో లింకులు.. ఆమె కాంటాక్టు లిస్ట్‌లో రానా, రకుల్

ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి కాల్ రికార్డులను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో మంటలు.. విశేషం ఏంటంటే..

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దేవా కట్టా.. విష్ణు ఇందూరిల మధ్య రాజుకుంటున్న వివాదం

‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్ట.. నిర్మాత విష్ణు ఇందూరిల మధ్య వివాదం రాజుకుంటోంది.