మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. అటు మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ తరువాత నటిస్తున్న సినిమా కాగా.. ఇటు దర్శకుడు కొరటాల శివ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డే్ట్‌ను చిత్రబృందం వెల్లడించింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ నవంబర్ 9 నుంచి జరగనుంది.

అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నవంబర్ 9 నుంచి మేజర్ షెడ్యూల్ జరగనుంది. ఈ భారీ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్‌ను షూట్ చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంలో చిరు దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే లీడర్ పాత్రలో చిరు నటిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో కూడా ఓ ఊరి కోసం.. గుడి కోసం పోరాడే నాయకుడిగా చిరు నటిస్తున్నారు. కమర్షియల్ అంశాలకు ఏమాత్రం ఢోకా లేకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ‘ఆచార్య’కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మణిశర్మ చాలా కాలం తర్వాత సంగీతం అందిస్తున్న భారీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం 2021 సమ్మర్‌లో విడుదల కానుంది.

More News

రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత..

సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే.

మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా బైడెన్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం.

బైడెన్.. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలివే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.

అమ్మో రాజశేఖర్.. బీభత్సం చేసేశాడు..

నిన్నటి నామినేషన్ పర్వం నేడు కూడా కొనసాగింది. నిన్న అవినాష్‌ని అభి నామినేట్ చేశాడు. ఇవాళ అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు.

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో ముగిసింది. కాగా.. పోలింగ్ ముగిసిన రాష్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.