భారీగా పెరిగిన బంగారం ధర
- IndiaGlitz, [Saturday,April 20 2019]
గురువారం ఒక్కసారిగా రూ.400కు పైగా పడిపోయిన పసిడి ధర.. శుక్రవారం మళ్లీ పైకి కదిలింది. దేశీ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.305 పెరుగుదలతో రూ.32,690కు చేరింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.204 పెరుగుదలతో రూ.38,450కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. ఇదిలా ఉంటే నిన్న గుడ్‌ఫ్రైడే కారణంగా అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్‌కు సెలవు ప్రకటించిన విషయం విదితమే.