ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న కరోనా.. నేడు 9 మందికి పాజిటివ్..

  • IndiaGlitz, [Monday,July 20 2020]

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అధికార యంత్రాంగమంతా ఎంతో కృషి చేస్తున్నప్పటికీ కరోనా కట్టడి సాధ్యం కావట్లేదు. ఎక్కడికక్కడ రెడ్ జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కరోనా కంట్రోల్ కావడం లేదు. మరోవైపు ఏపీ అసెంబ్లీని కరోనా కుదిపేస్తోంది.

తాజాగా అసెంబ్లీలో పని చేస్తున్న తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కు‌‌ చేరుకుంది. మరికొన్ని రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అసెంబ్లీలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అసెంబ్లీ ఉద్యోగులు కోరుతున్నారు. అసెంబ్లీలో అనేక జాగ్రత్త చర్యలను పాటిస్తుంటారు. అలాంటి చోటే కరోనా విజృంభిస్తుంటే.. ఇతర ప్రాంతాల పరిస్థితేంటని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.