లతా మంగేష్కర్‌కి అస్వస్థత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్(90) అనారోగ్యానికి గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆమెకు శ్వాస సంబంధిత సమస్య రావడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు. ఎడమ వెంట్రిక్యులర్ సమస్యతో పాటు నిమోనియా సమస్యే ఆమె అనారోగ్యానికి కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్ ఫరోఖియా ఉద్వాడియా పర్యవేక్షణలో లతా మంగేష్కర్‌కు చికిత్స అందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాల తెలియజేస్తున్నాయి.
ఇటీవల ఆమె అశుతోష్ గోవారికర్ చిత్రం ‘పానిపట్'లో గోపీకాబాయిగా నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్‌లుక్‌ను లతాజీ తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ తన 90వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వం డాటర్ ఆఫ్ ది నేషన్ అనే బిరుదుని కూడా ఇచ్చింది. అలాగే వీటితో ఆమెకు పద్మవిభూషణ్, పద్మభూషన్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ఆమె అందుకున్నారు. అలాగే మన దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నను కూడా ఆమె అందుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments