గతేడాది సూర్య.. ఈ ఏడాది మహేష్..
Send us your feedback to audioarticles@vaarta.com
అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలూ ఉన్నాయి.. అయినా అందలమెక్కలేని పరిస్థితి కన్నడ కస్తూరి ప్రణీతది. చిన్న సినిమాతో తొలి అడుగులు వేసి.. పెద్ద హీరోల పక్కన సెకండ్ లీడ్ చేసే స్థాయికి ఎదిగినా ఈ ముద్దుగుమ్మకి ఆశించిన స్థాయి గుర్తింపు రావడం లేదన్నది టాలీవుడ్ టాక్. 'అత్తారింటికి దారేది' అనే ఒకే ఒక విజయం మాత్రమే తన ఖాతాలో వేసుకున్న ప్రణీత తన ఆశలన్నీ కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం'పైనే పెట్టుకుంది.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ పక్కన మూడో హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 20న విడుదల కానుందీ చిత్రం. విశేషమేమిటంటే.. గతేడాది ఇదే మే నెలలో సూర్య వంటి అగ్ర కథానాయకుడుతో ప్రణీత జోడీ కట్టిన 'రాక్షసుడు' అనే తమిళ అనువాద చిత్రం విడుదలైంది. కట్ చేస్తే.. మరో స్టార్ హీరోతో ఏడాది తరువాత అదే నెలలో తాజా చిత్రంతో పలకరించనుంది ప్రణీత. మరి గతేడాది కలిసిరాని మే ఈ ఏడాది అయినా అమ్మడికి కలిసొస్తుందా..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com