ఊటీ లో షూటింగ్ జరుపుకుంటున్న 'లాస్ట్ సీన్'
Send us your feedback to audioarticles@vaarta.com
హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లు గా మధునారాయణ్ ముఖ్య పాత్రలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో దీపక్ బల్దేవ్ దర్శకత్వం లో ప్రకాష్ ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం "లాస్ట్ సీన్ ". ఈ నెల 16 న ముహూర్తం తో మొదలైన ఈ చిత్రం, రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టి వాలీ మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపు కుంటోంది , ఈసందర్భంగా దర్శకుడు దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం.
రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టి వాలీ మరియు పరిసర ప్రాంతాల్లో 40 రోజులు పాటు జరిపాలనుకొంటున్నాం, ఈ ఊటీ షెడ్యూల్ లో రెండు పాటలు మరియు ముఖ్యమైన సన్నివేశాల్ని పూర్తిచేస్తాం, అంతటితో సినిమా 80% షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఇక మిగిలిన 20% షూటింగ్ ని హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. కథ విషయానికి వస్తే సీటీ లైఫ్ వద్దు అని స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం కోసం ఊటీ లో సెటిల్ అవ్వాలనుకునే అబ్బాయి.
పల్లెటూరు కంటే సిటీ లైఫ్ బాగుంటుంది అని సిటీ అబ్బాయిని లవ్ చేసి సిటీలో సెటిల్ అవ్వాలి అనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అసలు ఆ పేమ నిలబడుతుందా..? అమ్మాయి మాట గెలుస్తుందా.. అబ్బాయి మాట గెలుస్తుందా అసలు ఈ ప్రేమ ఎవరి మాట గెలిపిస్తుంది అనేది ఈ మా "లాస్ట్ సీన్" ప్రేమ కథ ప్రతి యువతి యువకులకు నచ్చే 100% ప్రేమ కథ అని చిత్ర దర్శకుడు దీపక్ భలదేవ్ తెలుపుతూ రెండు షెడ్యూల్ లో మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి లో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: అనిల్, కెమెరామెన్: జవహర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, కాస్ట్యూమ్స్ డిజైనర్: రీటా బవాలి, మాటలు: రామం గోయల్, కో ప్రొడ్యూసర్: అజయ్ గౌతమ్, ఎక్సక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లా జగన్, పి.ఆర్.ఓ: కడలి మీడియా, కథ,కధనం మరియు దర్శకత్వం: దీపక్ బల్దేవ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments