చివరి గంటే కీలకం..
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ పోలింగ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. దాదాపు ఏ ఎన్నికల్లో అయినా 12 గంటల లోపు ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది. ఆ తరువాత పెద్దగా ఏమీ ఉండదు. ఇక చివరి గంటలో మాత్రం అసలేమీ ఉండదనే చెప్పాలి. అలాంటిది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది రివర్స్ అయింది. ఉదయం అంతా మందకొడిగా సాగిన పోలింగ్ చివరి గంటలో మాత్రం ఊపందుకుంది. ఏకంగా 9.6 శాతం పోలింగ్ చివరి గంటలోనే నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతమే పోలింగ్ నమోదు కాగా 6 గంటల వరకు 46.55 శాతంగా నమోదైంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సగటున 46.55 శాతం పోలింగ్ నమోదైంది. 2016 ఎన్నికల నాటి పోలింగ్ (45.27శాతం) కంటే ఇది.. 1.28శాతం ఎక్కువ. కాగా.. మంగళవారం సాయంత్రం తర్వాత సగటు పోలింగ్ శాతం 45.71గా వెల్లడైనప్పటికీ బుధవారం నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఫైనల్‌గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సగటు పోలింగ్ 46.55 శాతం జరిగిందని ప్రకటించింది. గురువారం ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో జరుగనున్న పోలింగ్‌ను కూడా కలిపితే ఆ మేరకు మొత్తం శాతం మారనుంది. పురుషుల పోలింగ్ శాతం 48.17గా ఉంటే... మహిళల ఓటింగ్ శాతం 44.79గా నమోదైంది. నగర శివారు ప్రాంతంలోని రామచంద్రాపురం డివిజన్‌లో అత్యధికంగా 67.71శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యూసు్‌ఫగూడ డివిజన్‌లో 32.99 శాతం నమోదైంది.
ఓల్డ్ మలక్‌పేట్‌లో జరుగుతున్న రీపోలింగ్..
కాగా.. నేడు మంగళవారం రద్దైన ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో రీ పోలింగ్ జరుగుతోంది. గుర్తు మారిపోవడంతో మంగళవారం ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 9 గంటల వరకు 4.44 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రీపోలింగ్ కొనసాగుతోంది. క్విక్ రియాక్షన్ టీం అందుబాటులో ఉన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ పోలీస్, ఆర్మ్ రిజర్వ్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments