మరోసారి లారెన్స్ దాతృత్వం.. 3 కోట్లు విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మంచి మనసు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎంతో మందిని అనాధ పిల్లలు, దివ్యాంగాలను అక్కున చేర్చుకుని వారిని పోషిస్తున్నాడు. మరీ ముఖ్యంగా తనకు ఫలానా కష్టం వచ్చిందని చెబితే చాలు ఆదుకోవడానికి ముందుంటాడు. అలాంటి లారెన్స్ కరోనా నేపథ్యంలో తన గొప్ప మనసు చాటుకున్నాడు.
ఎవరికెంత..!?
కరోనాపై పోరుకు తనవంతుగా రూ. 3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ డబ్బుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు, ఫెప్సీ యూనియన్ రూ. 50 లక్షలు, డ్యాన్సర్స్ యూనియన్‌కు రూ. 50 లక్షలు.. తన దగ్గరున్న దివ్యాంగులకు రూ రూ. 25 లక్షలు.. దీంతో పాటు తన సొంతూరైన రోయపురానికి చెందిన దినసరి కూలీలు, ప్రజల కోసం రూ. 75 లక్షలు ఇస్తున్నానని ట్విట్టర్ వేదికగా లారెన్స్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే..
కాగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘చంద్రముఖి-2’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే లక్కీ చాన్స్ లారెన్స్‌కు వచ్చింది. ఈ సినిమా నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ నుంచి రూ. 3 కోట్ల అడ్వాన్స్‌గా తీసుకున్న ఆయన.. ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో వేసుకోకుండా కరోనాపై చేస్తున్న పోరాటానికి విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకుని మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు.
— Raghava Lawrence (@offl_Lawrence) April 9, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments