వరద భాధితులకు లారెన్స్ భారీ సాయం..
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, కథానాయకుడుగా...ఇలా సినిమా రంగంలో తను ప్రవేశించిన ప్రతి శాఖలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ మాత్రమే కాదు...అంతకు మించి గొప్ప మానవతావాది.లారెన్స్ రాఘవేంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు.
తాజాగా చెన్నైలో వర్షాల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానికాన్ని ఆదుకునేందుకు లారెన్స్ భారీగా కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందచేయనున్నట్టు ప్రకటించారు. చెన్నైనగరాన్ని ఇలా చూడడం చాలా బాధగా ఉందన్నారు. సూపర్ స్టార్సే లక్షల్లో సహాయం చేస్తుంటే లారెన్స్ కోటి రూయాలు ఆర్ధిక సహాయం చేయడం నిజంగా గ్రేట్. మంచి మనసున్న లారెన్స్ భవిష్యత్ లో మరిన్నివిజయాలు సాధించాలి...ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com