జనవరి 20న లారెన్స్ 'శివలింగ' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,January 15 2017]

కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శివ‌లింగ‌'.రితిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన క‌న్న‌డ సూప‌ర్‌హిట్ మూవీ శివ‌లింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ- ''కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. అలాగే ఫిబ్రవరి లో సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ర్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు.

రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌.

More News

1 మిలియన్ మార్క్ ను అందుకుంటున్న శాతకర్ణి..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.

2 మిలియన్ దిశగా ఖైదీ నెం 150..!

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెం 150 చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల 7 లక్షలు వసూలు చేసిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇడియట్, ఆర్య సూపర్ హిట్ అయినట్లే 'నేను లోకల్' సూపర్ హిట్ అవుతుంది - దిల్ రాజు

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫస్ట్ డే కలెక్షన్స్

నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం, ప్రతిష్టాత్మకంగా క్రిష్ తెరకెక్కించిన సినిమా `గౌతమిపుత్ర శాతకర్ణి`. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్వైడ్ గా మంచి ప్రశంసలు అందుకుంది.

కాటమరాయుడు డిజిటల్ పోస్టర్ వచ్చేస్తుంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - శృతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రాన్ని కిషోర్ పార్ధసాని తెరకెక్కిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.