సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'లంక'
Send us your feedback to audioarticles@vaarta.com
రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ `లంక`. సీనియర్ హీరోయిన్ రాశి ఇందులో కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రాశి, సాయిరోనక్, ఇనసాహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా ప్రచార చిత్రాన్ని సీనియర్ జర్నలిస్ట్‌లు సి.ఎం.ప్రవీణ్‌కుమార్, జనార్ధన్ రెడ్డి, సాయిరమేష్, భూషణ్ విడుదల చేశారు.
మైండ్ గేమ్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా మూడు పాత్రల మధ్య సాగే చిత్రమే లంక. ఈ సినిమాలో ఒక పాట మాత్రమే ఉంటుంది. సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు ముని చెప్పారు. మంచి కథ అవసరం. రాశికి ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నిర్మాతలు తెలిపారు.కళ్యాణ్ వైభోగమే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాశికి ఈ లంక సినిమా మంచి బ్రేక్ అవుతుందని భావిస్తున్నానని దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యం రాజేష్. ముత్యాల రాందాస్, రవికుమార్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com