Chandrababu:ఫేక్ కంపెనీకి భూములు ధారాదత్తం.. చంద్రబాబు ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

  • IndiaGlitz, [Friday,March 08 2024]

ఉమ్మడి ఏపీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేక్ కంపెనీకి ప్రభుత్వానికి సంబంధించిన వందల ఎకరాలను ధారాదత్తంగా ఎలా కేటాయిస్తారని మండిపడింది. 2003లో ఐఎంజీ భారత్‌ అనే కంపెనీకి ఎకరం రూ.50వేల చొప్పున 850 ఎకరాల భూమిని అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.100కోట్లు పలుకుతుంది.. అంటే ఆ భూములు రూ.50వేల కోట్ల విలువ చేయనున్నాయి. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తిరిగి ఆ భూములను ప్రభుత్వానికి కేటాయిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ సంస్థ అధినేతగా అహోబలరావు అలియాస్ బిల్లీరావు ఉన్నారు. క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉన్న 450 ఎకరాలను కంపెనీకి కేవలం నాలుగు రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా ఆ సమయంలో సదరు భూమి విలువ ఎకరం సుమారు రూ.10 కోట్లు ధర పలుకుతుండగా కేవలం రూ.50వేల చొప్పున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అనంతరం టీడీపీ ప్రభుత్వం కూలిపోయి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సదరు భూములను వెనక్కు తీసుకుంటూ చట్టం చేస్తూ జీవో జారీ చేసింది. ఎలాంటి అనుభవం లేని ఫేక్ సంస్థకు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎటువంటి విచారణ లేకుండా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూముులను కారు చౌకగా ధారదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై తీవ్రంగా మండిపడింది.

అయితే వైఎస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ పిటిషన్‌ స్టేటస్ కోలోనే ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదనలు కొనసాగిన తరువాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో రూ.50వేల కోట్ల విలువ చేసే భూములు ఇప్పుడు ప్రభుత్వానికి దక్కాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More News

Balayya, Prabhas:'హంటింగ్' అంటున్న బాలయ్య.. 'భైరవ'గా రాబోతున్న ప్రభాస్‌..

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.

Shweta Mohan:ప్రఖ్యాత గాయని శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ‘స్త్రీ’

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకు రాబోతోన్నారు.

Kannappa:'కన్నప్ప' ఫస్ట్ లుక్‌లో అదరగొట్టిన విష్ణు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడు..

మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

LPG Cylinder Price: మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త.. వంట గ్యాస్ ధర తగ్గింపు...

మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంటగ్యాస్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

ఎట్టకేలకు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయమైంది. ఊహించినట్లుగానే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి.