'లాలిజో..లాలిజో' ట్రైలర్‌ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Sunday,October 22 2017]

సంభీత్‌, నేహారత్నాకరన్ హీరో హీరోయిన్లుగా జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్‌ పతాకంపై మోహన్‌ శ్రీ వత్సస దర్శకత్వంలో షంఖు, కిరణ్‌లు నిర్మిస్తోన్న 'లాలిజో లాలిజో' చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. హీరో సంభీత్‌, హీరోయిన్‌ నేహారత్నాకరన్లు ట్రైలర్‌ని ఆవిష్కరించగా, పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ లోగోని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..ఈ చిత్రం మా పాపలాంటిది. మా పాప చాలా అందంగా, అద్భుతంగా వచ్చింది. మాకు మంచి గుర్తింపు తెస్తుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఇది థ్రిల్లర్‌ కాదు, ప్యూర్‌ లవ్‌ స్టోరీ. మనకు తెలియకుండానే మన నాలుక మీద తిరిగే అందమైన ప్రేమ కథ ఇది. ఇది ఊహించని లవ్‌ స్టోరీ. దయచేసి రిలీజ్‌ రోజు మొదటి షో చూడండి. బాగాలేకపోతే సినిమా చూడవద్దని అందరికీ చెప్పండి. బాగుంటే పదిమందికి మంచి చిత్రమని చెప్పండి...అన్నారు.

పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి అవార్డు వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను..అన్నారు.

ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్‌, సంగీతం: మెలోడీ శ్రీనివాస్, కెమెరా: మురళి కృష్ణ, ఎడిటర్: క్రాంతి, నిర్మాతలు: షంఖు, కిరణ్‌, దర్శకత్వం: మోహన్‌ శ్రీ వత్సస.

More News

మెహ‌రీన్‌దే హ‌వా

2016 ఫిబ్రవరిలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైంది ఉత్తరాది భామ మెహరీన్. నాని హీరోగా నటించిన ఆ సినిమా సక్సెస్ కావడంతో.. ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు క్యూ కట్టాయి.

సంఘ‌మిత్ర గా లోఫ‌ర్ భామ ఫిక్స‌య్యింది

రూ.150 కోట్లకి పైగా బ‌డ్జెట్‌తో ఓ చారిత్రాత్మ‌క చిత్రాన్ని రూపొందించ‌డానికి ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు, కుష్బూ భ‌ర్త సుంద‌ర్.సి స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

కె.వి.రెడ్డిగా క్రిష్ ?

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ లో కేరళకుట్టి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఆకాశ వీధిలో అందాల జాబిలి పేరుతో కీర్తి పుట్టిన రోజున ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం

వెంకటేష్ తో యువ కథానాయకుడు..

ఈ ఏడాది ఆరంభంలో గురు చిత్రంతో సందడి చేశారు సీనియర్ కథానాయకుడు వెంకటేష్. తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్న ఆయన ఎట్టకేలకు ఓ మూవీకి ఓకే చెప్పారు.

వారం గ్యాప్ లో మహేష్, బన్నీ?

ఈ సంవత్సరం ఒకే ఒక సినిమాతో సందడి చేసారు సూపర్స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. స్పైడర్ చిత్రంతో సెప్టెంబర్లో మహేష్ అభిమానుల ముందుకొస్తే..