'భీమ్లా నాయక్' నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. మందు బాటిల్‌తో పవన్ రచ్చ!
Send us your feedback to audioarticles@vaarta.com
వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా యాక్షన్ థ్రిల్లర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. 2020లో మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 12 జనవరి 2022న ‘‘భీమ్లా నాయక్’’ థియేటర్లలో సందడి చేయనున్నాడు.
విజయ దశమి సందర్భంగా ఈ మూవీ నుంచి ‘అంతా ఇష్టం’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా చిత్ర గానం చేశారు. ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా “లాలా భీమ్లా” అనే లిరికల్ సాంగ్ ను బుధవారం సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్‌కు సంబంధించి కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపించారు. నేలపై కూర్చొని తన ముందు మందు బాటిల్ పెట్టుకుని…. లుంగీ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు పవర్ స్టార్. ఇక ఈ చిత్రంలో పవన్, రానా క్యారెక్టర్ల యాటిట్యూడ్, వీరిద్దరి మధ్య జరిగే ఘర్షణ వంటి అంశాలు వేరే లెవల్‌లో వుండబోతున్నాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com