'భీమ్లా నాయ‌క్' నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘లాలా భీమ్లా’

  • IndiaGlitz, [Sunday,November 07 2021]

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్‌ ఆదివారం మరో సాంగ్‌ను విడుదల చేసింది. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను స్టార్ డైరెకట్ర్ తివిక్రమ్ స్వయంగా రాశారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. పవన్ క్యారెక్టర్ అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట పవర్‌స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు...
పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు... అంటూ త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించారు.

ఇప్పటికే భీమ్లా టైటిల్ సాంగ్‌తో పాటు అంతా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై మరో పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కలిసి నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యువ నటుడు రానా కూడా నటిస్తున్నారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు : ముగ్గురు సేఫ్.. ఇంకా డేంజర్‌ జోన్‌లో ఐదుగురు, మరి ఎలిమినేషన్‌ ఎవరో..?

బిగ్‌బాస్ 5 తెలుగు శనివారం సరదాగా సాగింది. ఎప్పటిలాగే వీకెండ్ కావడంతో నాగ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్ తప్పుల్ని ఎత్తిచూపుతూ వారికి క్లాస్ పీకారు.

పుట్టినరోజు వేళ అభిమానులకు అనుష్క సర్‌ప్రైజ్.. 48వ సినిమాకు గ్రీన్‌సిగ్నల్

అనుష్క శెట్టి .. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

#MEGA154: ఊర నాటు లుక్‌లో మాస్ మూల విరాట్ .. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో జోరు మీదున్నారు. 70కి చేరువవుతున్నా కుర్రాళ్ల కంటే స్పీడుగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ను రెడీ

"ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే" : శ్యామ్‌ సింగరాయ్‌ లిరికల్‌ సాంగ్‌ అదరహో

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లు.

రామ్ చరణ్ రిలీజ్ చేసిన సుమ 'జయమ్మ పంచాయితీ' ఫస్ట్ లుక్‌

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్