Lal Singh Chaddha: చిరంజీవి కోసం ‘‘లాల్ సింగ్ చద్దా’’ స్పెషల్ ప్రివ్యూ.. అమీర్‌తో పాటు స్పెషల్ గెస్ట్‌లు
Send us your feedback to audioarticles@vaarta.com
తన చిత్రాలతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ కష్టాల్లో వున్నప్పుడు తన వంతు సాయం తప్పకుండా చేస్తారు. ధియేటర్ల ఇబ్బందులు, టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సమస్యను పరిష్కరించారు చిరు. చిన్న హీరోలు, నిర్మాతలు పిలిస్తే కాదనకుండా ఆయా సినిమాలకు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. ఇక నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయనకు టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోని హీరో, హీరోయిన్లు, టెక్నీషియన్లతో సన్నిహిత సంబంధాలు వున్నాయి .
ఆగస్ట్ 11న లాల్ సింగ్ చద్దా స్పెషల్ విడుదల :
వీరిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తోనూ చిరంజీవికి ఎన్నో ఏళ్లుగా అనుబంధం వుంది. అమీర్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరంజీవిని కలవడమో, ఫోన్ చేయడమో చేస్తారు. తాజాగా అమీర్ లేటెస్ట్ మూవీ ‘‘లాల్ సింగ్ చద్దా’’. ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ అగ్రకథానాయిక కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా కనిపిస్తుండటం.. తెలుగు యువ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలకపాత్రలో నటిస్తుండటంతో ‘లాల్ సింగ్ చద్దా’’పై భారీ అంచనాలున్నాయి.
చిరు ఇంటికి నాగ్, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య:
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. దీనిలో భాగంగా తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి కోసం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రివ్యూను వేశారు. చిరు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రివ్యూకు ప్రత్యేక అతిథులుగా అక్కినేని నాగార్జున , ఆయన తనయుడు నాగచైతన్య, ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్‌లు హాజరయ్యారు. ఈ సినిమాను చూసిన వీరంతా చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రివ్యూకి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments