Lal Salaam:ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. రజినీకాంత్ డైలాగ్ అదిరింది..

  • IndiaGlitz, [Wednesday,February 07 2024]

మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లాల్ సలామ్'(LAL SALAAM) తెలుగు ట్రైలర్‌ మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని తలైవా చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. రజనీ లుక్, స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత రజనీకి తెలుగులో సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఓ వైపు గ్రామీణ రాజకీయాలు, మరోవైపు క్రికెట్ నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతోంది. భారత్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రజనీ కూతరు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేయగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది.

నటీనటులు:

ర‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క‌పిల్ దేవ్‌, సెంథిల్, తంబి రామ‌య్య, అనంతిక‌, వివేక్ ప్రస‌న్న, తంగ దురై, ధన్య బాలకృష్ణ, త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్షన్స్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం: ఐశ్వర్య ర‌జినీకాంత్, నిర్మాత‌: సుభాస్కర‌న్‌, సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, ఎడిటింగ్‌: బి.ప్రవీణ్ భాస్కర్‌, లైకా ప్రొడ‌క్షన్స్ హెడ్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, ఆర్ట్‌: రాము తంగ‌రాజ్, స్టైలిష్ట్‌: స‌త్య ఎన్‌.జె, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, కిక్కాస్ కాళి, స్టంట్ విక్కీ, స్టోరి: విష్ణు రంగ‌స్వామి ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: శివ‌మ్ సి.క‌బిల‌న్‌, పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ - ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), తెలుగు రిలీజ్ : శ్రీ లక్ష్మీ మూవీస్

More News

Family Star:రౌడీ హీరో 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసిందిగా.. వినేయండి..

రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తనకు 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో

Modi:దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదు.. ప్రధాని మోదీ ఫైర్..

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా

DSC Notification:నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీ నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదలైంది.

Babu Mohan:బీజేపీకి ఊహించని షాక్.. పార్టీకి బాబుమోహన్ రాజీనామా..

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాబుమోహన్(Babu Mohan) పార్టీకి గుడ్ బై చెప్పారు.

YS Sharmila:ప్రత్యేక హోదా కోసం.. సీఎం జగన్, చంద్రబాబుకు వైయస్ షర్మిల లేఖాస్త్రాలు..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) దూకుడు పెంచారు.