'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 22న విడుదల

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

‘లక్షీస్ ఎన్టీఆర్’’ డిస్ట్రిబ్యూషన్ హక్కుల గురించి వస్తున్న పుకార్లను నమ్మొద్దు,సినిమా విడుదల మార్చి 22 -దర్శక నిర్మాతలు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్ కి కొన్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని ,ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జి.వి ఫిలింస్,రామ్ గోపాల్ వర్మ మరియు రాకేష్ రెడ్డి లు త్వరలోనే తెలియజేస్తామన్నారు.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు.ఇప్పటికే ట్రైలర్ ,ఓ సాంగ్ కి అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ థియేట్రికల్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది చూసారు..లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘‘నీ ఉనికి’’ అనే సాంగ్ ను కూడా 30 లక్షల మందికి పైగా చూశారు.. వీటన్నిటినీ చూస్తుంటే ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా కు రేపు మార్చి 22న థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం. ఈ సంవత్సరంలో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా మారిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రం వేసవి కాలం పూర్తిగా రాకముందే అందరిలో వేడి సెగలు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

 

More News

'ఆర్‌ ఎక్స్‌–100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

స్వాతి నాయుడు సడన్‌ ట్విస్ట్‌‌తో ఫ్యాన్స్ షాక్!

స్వాతి నాయుడు.. ఈ పేరు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. యూ ట్యూబ్‌ గురించి కాసింత అవగాహన ఉన్నవాళ్లకు.. మరీ ముఖ్యంగా కుర్రకారుకు అయితే అస్సలే పరిచయం అక్కర్లేదు

జగన్‌‌ను గెలిపించేందుకు వైసీపీలో చేరా: ఎన్టీఆర్ మామ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల జంపింగ్‌‌లు షురూ అవుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షపార్టీల్లోకి పలువురు నేతలు చేరగా

ఆయన టీడీపీలోకి.. ఈయన వైసీపీలోకి..!?

ఇద్దరూ సీనియర్లే.. ఒకరికొకరేం తక్కువ కాదు.. ఒకరు టీడీపీలో ఉంటే ఇంకొకరు మరో పార్టీలో ఉంటారు.

భార‌త్ ఎటాక్స్.. పూరి రియాక్ష‌న్‌..

ప్ర‌స్తుతం భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌దైన రీతిలో స్పందిస్తున్నారు.