లారెన్స్ హీరోయిన్ తో పవర్ స్టార్...
Send us your feedback to audioarticles@vaarta.com
కాంచన, అధినాయకుడు, బలుపు వంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను తన సోయగాలతో అలరించిన సొగసరి లక్ష్మీరాయ్ ప్రస్తుతం లక్కీఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న సర్ధార్ గబ్బర్ సింగ్` చిత్రంలో పవన్ సరసన మెరవనుంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి లక్ష్మీరాయ్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా, లేక ఏదేని స్పెషల్ సాంగ్ లో నటిస్తుందో చూడాలి. అయితే మొత్తం మీద లక్ష్మీరాయ్ పవన్ సరసన నటించడం ఖాయమైంది. ఈ విషయాన్ని లక్ష్మీరాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com