లారెన్స్ హీరోయిన్ తో పవర్ స్టార్...

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

కాంచన, అధినాయకుడు, బలుపు వంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను తన సోయగాలతో అలరించిన సొగసరి లక్ష్మీరాయ్ ప్రస్తుతం లక్కీఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రంలో పవన్ సరసన మెరవనుంది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి లక్ష్మీరాయ్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా, లేక ఏదేని స్పెషల్ సాంగ్ లో నటిస్తుందో చూడాలి. అయితే మొత్తం మీద లక్ష్మీరాయ్ పవన్ సరసన నటించడం ఖాయమైంది. ఈ విషయాన్ని లక్ష్మీరాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.