పవన్ ని నమ్ముకున్నారు
Send us your feedback to audioarticles@vaarta.com
ఐరెన్‌లెగ్ బ్రాండ్ పొందిన హీరోయిన్‌లకు అవకాశాలిచ్చి మరి.. వారి కెరీర్‌కి ఉపయోగపడే విజయాలను అందించిన ఘనత పవన్ కళ్యాణ్‌ది. ఇప్పుడు ఈ విషయమే ఇద్దరు ఫ్లాప్ హీరోయిన్‌లకు ఆశను పెంచుతోంది. ఆ ఇద్దరు హీరోయిన్‌లే రాయ్ లక్ష్మీ, సంజన. ఈ ముద్దుగుమ్మలిద్దరు పవన్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్' కోసం టాప్ హీరోయిన్ కాజల్‌తో పాటు కలిసి నటిస్తున్నారు.
తెలుగులో హీరోయిన్‌గా ఇప్పటివరకు ప్రాపర్ హిట్ లేని రాయ్ లక్ష్మీకి ఈ చిత్రంతో ఆ లోటు తీరుతుందని ఆమె ఆశపడుతోంది. ఇక 'బుజ్జిగాడు' చిత్రం కోసం సైడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన.. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గానూ.. సైడ్ హీరోయిన్‌గానూ నటించినా విజయాలైతే దక్కలేదు. ఆ లోటు 'సర్దార్' తీరుస్తాడని ఆమె ఆశపడుతోంది. మరి పవన్ ని నమ్ముకున్న ఈ చక్కనమ్మలకి కోరుకున్న విజయం దక్కుతుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments