చిరంజీవిని ఎత్తేస్తుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, ఠాగూర్ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్ స్పెషల్ సాంగ్‌లో కాలు కదుపుతుంది.
క్యాథరిన్ స్థానంలో స్పెషల్ సాంగ్ కోసం లక్ష్మీరాయ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. `చిరంజీవిగారితో నటించడం నా కల. ఖైదీ నంబర్ 150 సెట్స్‌లో ఆయనతో డ్యాన్స్ చేయడం మరిచిపోలేని అనుభూతి. రత్నంలాంటి మనిషి..మనసు బంగారం.. అందుకే నేను ప్రత్యక్షసాక్షి, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు..అంటూ లక్ష్మీరాయ్ చిరును తన ట్విట్టర్‌లో ఆకాశానికెత్తేస్తుంది. తమ్మడు పవర్‌స్టార్‌తో సర్దార్ గబ్బర్ సింగ్‌లో చిందేసిన లక్ష్మీరాయ్, ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్‌తో నర్తిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com