క్రేజీ హీరోలు, దర్శకులతో భారీ చిత్రాల నిర్మాణం దిశగా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'
Send us your feedback to audioarticles@vaarta.com
వీడుతేడా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాతో నటుడు చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుధీర్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా నిర్మించిన స్వామి రారా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు, నిర్మాతగా చక్రి చిగురు పాటికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా ఎ.ఎన్.బోస్ దర్శకుడిగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించారు. ఇలా వరుసగా మూడు చిత్రాలకు ముగ్గురు కొత్త దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేసింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో తాము రెడీగా ఉంటామని ఈ మూడు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు.
ఇక ఇప్పుడు…. సూపర్ ఫాంలో దూసుకెళ్తున్న సందీప్ కిషన్ హీరోగా కేరాఫ్ సూర్య పేరుతో ద్వి భాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా.. ఎమోషనల్ స్టోరీస్ ని అద్భుతంగా తీయగలడన్న పేరున్న సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అందాల భామ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు… శ్రీరస్తు శుభమస్తుతో సూపర్ హిట్ అందుకున్న అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో ఇంటెల్లిజెంట్ సూపర్ హిట్ చిత్రం అందించిన వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్లో 5వ చిత్రంగా చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఇందులో గ్లామర్ డాల్స్ సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలపై నిర్మాత చక్రి చిగురుపాటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఘన విజయం సాధించే రెండు చిత్రాల్ని బ్యాక్ టూ బ్యాక్ నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు నిర్మాత చక్రి.
ఇదిలా ఉంటే… త్వరలోనే టాలీవుడ్ టాప్ క్రెజీ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తదితర హీరోలతో, దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని నిర్మాత చెబుతున్నారు.
ఈ సందర్భంగా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" అధినేత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ…. వీడు తేడా, స్వామి రారా, మోసగాళ్లకు మోసగాడు వంటి విభిన్న చిత్రాలతో "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. ఇదే ప్రోత్సాహంతో సందీప్ కిషన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా సుశీంద్రన్ దర్శకత్వంలో కెరాఫ్ సూర్య అనే ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్ర షూటింగ్ చాలా బాగా జరుగుతుంది.
దీంతో పాటు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా మరో చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్ వాల్యూను మరింత పెంచుతాయనే ధీమాగా ఉన్నాం. త్వరలోనే మా బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్రేజీ హీరోలు, దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నాం. మరి కొద్ది రోజుల్లోనే ఆ చిత్రాలకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా తెలియజేస్తాం. ఇప్పటివరకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు తగిన గుర్తింపును తెచ్చిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments