లక్ అంటే లక్ష్మీదే
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరి వెంట అదృష్టం వద్దన్నా వెంటపడుతుంది. అలాంటి కొందరిలో కేరళకుట్టి లక్ష్మీ మీనన్ ఒకరు. తమిళనాట ఈ సుందరి నటించిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఏ టాప్ హీరోయిన్ కూడా ఇటీవల కాలంలో లక్ష్మీ సాధించిన ట్రాక్ రికార్డ్‌ని సొంతం చేసుకోలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే అజిత్‌కి చెల్లెలుగా నటించే ధైర్యం చేసింది లక్ష్మీ. 'వేదాళం'గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించినప్పటికీ.. లక్ష్మీదే కీలక పాత్ర. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ని మూటగట్టుకోవడంతో.. ఎప్పటిలానే లక్ష్మీ తన లక్‌ని చెల్లెలు వేషంలోనూ కొనసాగించిందని తమిళసినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments