శ్రుతి హాసన్‌ని డామినేట్ చేసేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రుతి హాసన్. ఈ దీపావళికి అజిత్‌తో నటించిన తమిళ చిత్రం 'వేదాళమ్'తో తన మాతృభాష ప్రేక్షకులను పలకరించనుంది శ్రుతి. ఈ సినిమాలో కేరళ కుట్టి లక్ష్మీ మీనన్ కూడా నటిస్తోంది. అయితే హీరోయిన్‌గా కాదు.. అజిత్ చెల్లెలుగా. అయినప్పటికీ 'వేదాళమ్' హిట్ అయితే.. ఆ క్రెడిట్ లక్ష్మీకే దక్కుతుందని తమిళ తంబీలు ముచ్చటించుకుంటున్నారు.
ఎందుకంటే.. 'వేదాళమ్' సినిమా లక్ష్మీ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. అంతేకాదు.. తమిళంలో లక్ష్మీ ఇప్పటివరకు నటించిన సినిమాలేవీ పరాజయం కాకపోవడం కూడా మరో కారణంగా చెప్పుకుంటున్నారు. శ్రుతికి తమిళంలో ఇప్పటివరకు భారీ విజయం ఒక్కటీ లేదు. కొంతలో కొంత 'పూజై' హిట్ ఫిల్మ్‌గా నిలిచింది అంతే. ఈ నేపథ్యంలో శ్రుతిని సినిమా పరంగానే కాకుండా.. రిజల్ట్ క్రెడిట్ పరంగానూ లక్ష్మీ మీనన్ డామినేట్ చేసేలా ఉందని చెన్నై వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments