తుది దశ చిత్రీకరణలో 'లక్ష్మీ బాంబ్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్'. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో...
మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. సినిమా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్. ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తున్నారు. ఫైట్స్, సాంగ్స్ బాగా వచ్చాయి. డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారు. ఆయన్ను ఫాలో అవుతున్నాను. హిందీలో ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ వస్తున్నాయి. అలాంటి మూవీ ఇదవుతుంది. అనుకున్నది అనుకున్నట్లు పూర్తయితే సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.
చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ''మంచి టీం కుదిరింది. సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం. మంచులక్ష్మీగారి, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి 80శాతం సినిమా పూర్తయ్యింది. సినిమాను దీపావళి ముందే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ''కామెడి, ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆగస్ట్ 15కు పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో ప్లాన్ చేస్తున్నాం. దీపావళికి ముందే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ఉమా లక్ష్మీ నరసింహ, సినిమాటోగ్రాఫర్ మల్హర్‌భట్ జోషి, అమిత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పోసాని కృష్ణమురళి, హేమ, ప్రభాకర్, భరత్‌రెడ్డి, జీవా, అమిత్, హేమంత్, రాకేష్, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్, రాజాబాబు, శరత్,శ్రీహర్ష, విశాల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్ రెడ్డి, డ్యాన్స్: కిరణ్, ఆర్ట్: రఘుకులకర్ణి, ఫైట్స్: రాంబాబు, వెంకట్, నందు, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: కరుణాకర్, కాసర్లశ్యామ్, సంగీతం: సునీల్‌కశ్యప్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.మురళి, సుబ్బారావు, ఆర్.సురేంద్రరాజు, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com