తెలుగు »
Interviews »
మేము సైతం ద్వారా నా జన్మధన్యమైంది - ఇక నటిగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..! మంచు లక్ష్మిప్రసన్న
మేము సైతం ద్వారా నా జన్మధన్యమైంది - ఇక నటిగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..! మంచు లక్ష్మిప్రసన్న
Friday, October 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విజయం సాధిస్తున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ మంచు లక్ష్మిప్రసన్న. మేము సైతం అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నమంచు లక్ష్మి ప్రసన్న పుట్టినరోజు ఈ నెల 8న. ఈ సందర్భంగా మంచు లక్ష్మిప్రసన్నతో ఇంటర్ వ్యూ మీకోసం..!
మేము సైతం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి మంచి చేస్తున్నారు. మీరు ఎలా ఫీలవుతున్నారు..?
ఈ ప్రొగ్రామ్ కి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ చాలా బాగా కోపరేట్ చేసారు. అసలు నేను వాళ్లను ఏమీ అడగకుండానే వాళ్లే ఎమౌంట్ ఇస్తున్నారు. నేను ఒక్కరిని కూడా ఎమౌంట్ అడగలేదు. ఈ షో ద్వారా పది మందికి సహాయం చేస్తే చాలు అనుకున్నాను. కానీ ఈ ప్రొగ్రామే నాకు హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ షో వలన మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయ్యాను. బాధలు ఎలా ఉంటాయో ఎలా సహాయం చేయాలో తెలుసుకున్నాను.
ఈ షోకి రమ్మని ఎవరెవర్ని అడిగారు..?
అందర్నీ అడిగాను ఒక్క ప్రభాస్ తప్ప. కొంత మందిని షోకి వచ్చి ఏం చేయనవసరం లేదు మీరు మీలా ఉండండి అంటే భయపడుతున్నారు అదే నాకు షాకింగ్ అనిపించింది. ఈ షోకి వచ్చి పర్ ఫార్మెన్స్ చేయనవసరం లేదు. అయినా ఎందుకనో కొంత మంది ఇబ్బంది పడుతున్నారు.
ప్రభాస్ ని షోకి రమ్మని ఎందుకు పిలవలేదు..?
బాహుబలి 2 చేస్తున్నాడు కదా..! ప్రభాస్, రాజమౌళిని ఇబ్బంది పెట్టడం ఎందుకని పిలవలేదు. రానా నాకు బాగా క్లోజ్. ఆ చనువు కొద్ది రానా తో ఈ షో చేసాను. తను ఏదైనా చెప్పడానికి కానీ.. చేయడానికి కానీ... మోహమాట పడడు.
అసలు...మేము సైతం షో ఎలా స్టార్ట్ అయ్యింది..?
నేను ఇలాంటి షో చేయాలి అని చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను. అయితే...నేను ఏమీ ట్రై చేయకుండానే ఈ షో నా దగ్గరకి వచ్చింది. ఈ షోకి నేను మీలో నేను అనే టైటిల్ అనుకున్నాను. ఆతర్వాత మేము సైతం అందరూ బాగుంటుంది అనడంతో ఓకే చేసాం. ఈ షోకి వచ్చిన వాళ్లను ఇప్పుడు తలుచుకున్నా నాకు ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ షో ద్వారా చాలా మందికి హెల్ప్ చేసాను. నా జన్మధన్యం అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది.
మీ సినిమా లక్ష్మి బాంబ్ ఎలా ఉండబోతుంది..?
ఈ సినిమా ప్రొడ్యూసర్స్ టైటిల్ లక్ష్మి బాంబ్ అని చెప్పగానే...నాకు సిగ్గేసింది. వాళ్లు నా దగ్గరికి రావడమే ఈ టైటిల్ తో వచ్చారు. వర్కింగ్ టైటిల్ గా పెట్టుకుందాం అన్నారు. ఆతర్వాత ఈ టైటిలే ఫిక్స్ చేసేసారు. టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాత రెస్పాన్స్ మామూలుగా లేదు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ఇండస్ట్రీ నుంచి ఇంతకు ముందు ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టలేదు అని అడిగారు. ఈ చిత్రంలో చాలా ఇంట్రస్టింగ్ రోల్ చేసాను. నాకు బ్రదర్స్ ఉండడంతో ఈ రోల్ చేయడానికి హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. ఫ్యామిలీ, హర్రర్, డ్రామా...ఇలా అన్ని అంశాలు ఉన్న డిఫరెంట్ స్ర్కిప్ట్ ఇది.
మీ ప్రొడక్షన్ లో సినిమాలు ఎప్పుడు నిర్మించనున్నారు..?
నాకు కథ నచ్చాలి. నన్ను ఇన్ స్పైయిర్ చేసే స్టోరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాను.
రోజురోజుకు మీ అందం పెరుగుతుంది కారణం ఏమిటి..?
ఎక్కువ కష్టపడుతున్నాను కాబట్టే అందంగా ఉంటున్నాను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి పాత ఫోటోలు చూసుకుంటే నేను ఇలా ఉండేదాన్నా అనిపిస్తుంది. ఆర్టిస్టుగానే లైఫ్ అంతా గడపాలి అనుకుంటున్నాను. నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు.ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు చాలా క్లియర్ గా ఉంటున్నారు.నిర్మాతగా, నటిగా ఏదైనా సినిమాలోనే..!
మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది..?
అమ్మ,నాన్న, నా మేన కోడలు అందరితో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నాకు పాప పుడితే ఈ బిజీ లైఫ్ లో ఎలా చూసుకుంటాను.. అసలు టైమ్ ఉంటుందా అనిపించేది. పాప పుట్టిన తర్వాత నా లైఫే మారిపోయింది. అసలు పాప పుట్టక ముందు నా లైఫ్ ఎలా ఉండేది అనిపిస్తుంది.
ఇండస్ట్రీలో ఎలాంటి మార్పు రావాలి అనుకుంటున్నారు..?
చదువుకున్న ఆడవాళ్లు ఇండస్ట్రీలోకి రావాలి. ఆడవాళ్లు నటిగా, నిర్మాతగా మంచి సినిమాలు చేయాలి. ఇండస్ట్రీలో ఈ మార్పు రావాలి అని కోరుకుంటున్నాను.
లక్ష్మి బాంబ్ తర్వాత చేసే సినిమా ఏమిటి..?
ఒక సినిమా అంగీకరించాను. ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్. అంతకు మించి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పను ఎందుకంటే...ఈ సినిమా చేస్తాను అని చెప్పాను కానీ ఇంకా సైన్ చేయలేదు (నవ్వుతూ...)
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా..?
మా నాన్నతో కలిసి సినిమా చేయాలనేది డ్రీమ్. అందులో నా పాత్ర సవాల్ విసిరేలా ఉండాలి. అలాంటి కథ కోసం చూస్తున్నాను. కథ కుదిరితే తప్పకుండా నాన్నతో సినిమా చేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments